3బంతుల్లో 193పరుగులు టి-10లీగ్‌లో సలీమ్‌ విధ్వంసం

Dec 8,2023 21:39 #Cricket
t20 league saleem

దుబాయ్: టి10 లీగ్‌లో ఓ సంచలనం నమోదైంది. యూరోపియన్‌ క్రికెట్‌ టి10 లీగ్‌లో భాగంగా స్పెయిన్‌ ఆటగాడు హంజా సలీమ్‌ ధార్‌ కేవలం 43బంతుల్లోనే అజేయంగా 193పరుగులు చేసి రికార్డు నమోదు చేశాడు. ఇందులో 22సిక్సర్లు, 14 బౌండరీలున్నాయి. కాటలున్యా జాగ్వార్‌-సోహల్‌ హాస్పిటాల్టెట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హంజా ఈ రికార్డు నెలకొల్పాడు. హమ్జా చేసిన 193 పరుగులలో సిక్సర్ల ద్వారా 132 పరుగులు రాగా ఫోర్ల ద్వారా 56 (మొత్తంగా 188) పరుగులు వచ్చాయి. అంటే అతడు సింగిల్స్‌, డబుల్స్‌ ద్వారా చేసినవి 9 పరుగులు మాత్రమే. దీంతో తొలి బ్యాటింగ్‌ దిగిన జాగ్వార్‌.. నిర్ణీత 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 257 పరుగులు చేసింది. హమ్జాతో పాటు మరో ఓపెనర్‌ యాసిర్‌ అలీ 19 బంతుల్లోనే 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టి10 క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అనంతరం ఛేదనలో హాస్పిటాల్టెట్‌ 10 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో జాగ్వార్‌.. 153 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

➡️