సిద్దార్ద్‌ కౌల్‌కు పిలుపు -కౌంటీ ఛాంపియన్‌షిప్‌

May 8,2024 23:03 #Sports

లండన్‌: భారత పేసర్‌ సిద్ధార్ద్‌ కౌల్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. కౌంటీల్లో ఆడేందుకు సిద్దార్ద్‌ కౌల్‌కు బుధవారం పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్‌ ట్రెమైన్‌ స్థానంలో నార్తాంప్టన్‌షైర్‌ తరఫున సిద్దార్ద్‌ ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో పంజాబ్‌కు చెందిన సిద్ధార్ద్‌ మే 10న గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌ నుంచి నార్తాంప్టన్‌షైర్‌కు అందుబాటులో ఉండనున్నాడు. 33ఏళ్ల సిద్ధార్ద్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 284వికెట్లు తీయగా.. ఇందులో 16సార్లు ఐదు వికెట్లకు పైబడి సాధించాడు. దీంతో అతడు ఆఘమేఘాల మీద ఇంగ్లండ్‌కు పయనమై వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు, ప్రతి గేమ్‌లోనూ గెలుపు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపాడు.

➡️