సిరీస్‌ సమం.. బంగ్లాపై న్యూజిలాండ్‌ ఘన విజయం..

Dec 9,2023 16:04 #Cricket, #Sports

మిర్పూర్‌ : మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌(40 నాటౌట్‌), మిచెల్‌ శాంట్నర్‌(35) విజయంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్‌ మిరాజ్‌ 3 వికెట్లు, తైజుల్‌ ఇస్లాం 2, షోర్‌ఫుల్‌ ఇస్లాం ఒక వికెట్‌ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆజాజ్‌ పటేల్‌ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్‌ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది.

➡️