అంగన్వాడీల రిలేదీక్షలు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాపితంగా వివిధ రూపాల్లో ఉద్యమం చేపట్టారు. కడప నగరంలో రిలేదీక్షలు చేశారు. కొన్ని చోట్ల మోకాలిపై నిల్చుని వేడుకుని నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కడప అర్బన్‌ : అంగన్వాడి సమస్యలు పరిష్కా రమయ్యే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మీదేవి తెలిపారు. శుక్రవారం రూరల్‌లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పరిస్థితి బాగాలేదని అంగన్వాడీలు అర్థం చేసుకోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జీతాలు పెంచడానికి, సంక్షేమ పథకాల పేరుతో బట్టలు నొక్కడానికి డబ్బులు ఉంటే అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన వాగ్దా నాలను గుర్తు తెచ్చుకుని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదా రాబోవు ఎన్నికలలో మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు భాగ్యలక్ష్మి , సిఐటి యు నాయకులు అంజనా దేవి, పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లు, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ నాయకులు గంగోజీ,పద్మ, సావిత్రి, సంటెమ్మ, కష్ణవేణి పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నిర్బంధాలతో అంగన్వాడీ ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. చెన్నూరు : సూపర్‌వైజర్‌ నాగతర్న అంగన్వాడీలను వేధించడం సరికాదని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మిదేవి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి, పొర్లు దండాలు పెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మిదేవి మాట్లా డుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని 18 రోలుగా సమ్మె చేస్తుంటే చిన్న మాచుపల్లి సూపర్‌ వైజర్‌ నాగరత్న అంగన్వాడీ టీచర్లను, ఆయాలను బెదిరించి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ‘అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని, లేకపోతే మీకు ఉద్యోగాలు ఉండవని’ బెదిరి స్తున్నారని వాపోయారు. ప్రభుత్వం నుంచి సూపర్‌వైజర్‌కు ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని ప్రశ్నించారు. వర్కర్లకు ఏమైనా జరిగితే సూపర్‌వైజర్‌ పూర్తి బాధ్యత వహించాలన్నారు. అంగన్వాడీలు హక్కుత సాధన కోసం సమ్మె నిర్వహి స్తున్నారని చెప్పారు. వేతనాల పెంపు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసే వరకు సమ్మె కొన సాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డివై ఎఫ్‌ఐ నాయకులు డి.ఎం. ఓబులేసు, అంగ న్వాడీ యూనియన్‌ నాయకులు పద్మ రెడ్డమ్మ లక్ష్మీదేవి సుబ్బలక్ష్మి బుజ్జి సిఐటియు నాయకులు పరమేష్‌ పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిj ుజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా నాడు ప్రతిపక్షనేతగా వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అంగ న్వాడీలకు తమ ప్రభుత్వం రాగానే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తానని, కనీస వేతనం అమలు చేస్తానని. హెల్పర్లకు ప్రమో షన్లు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని పూర్తిగా మరిచారని వాపోయారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్మికులు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాపాడు : 18 రోజు లుగా తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో సామ రస్యంగా నిరసన దీక్ష చేపడుతున్న అంగన్వాడీలు రోజుకో వినూత్న రీతిలో దీక్షను కొనసాగిస్తున్నారు. శుక్రవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తల మండల నాయ కులు సుజాత మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ వేతనాలు పెంచుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీల సమస్యలు పరిష్కరి ంచాలంటూ సిఎం జగనన్నకు అంగన్వాడీ ఉద్యోగులు పోస్టు కార్డులు పంపిణీ చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాల యం వద్ద సమ్మె చేస్తూ సిఎం జగనన్నకు పోస్టు కార్డుల్లో తమ డిమాండ్లను నేరవేర్చాలంటూ రాసి ఉత్తరాలు పంపించారు. విన్నూతంగా ఎన్ని కార్యక్ర మాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శి ంచారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల అంగన్వాడీ మహిళాలు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి విధులకు హజరు అయ్యేలాగ చూడాలని కోరారు. సమ్మె కార్యక్రమంలో వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల్లోని అంగన్వాడీలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని తహశీ ల్దార్‌ కార్యాలయం ముందు సిఐ టియు ఆధ్వర్యంలో 18వ రోజు నిరసన తెలిపారు . ఆర్‌డిఒ వెంకట రమణకు వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం అంగన్వాడీ సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. భైరవ ప్రసాద్‌, జనసేన పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి సుంకర శ్రీనివాసులు, జనసేన బద్వేల్‌ నియోజకవర్గ కో- ఆర్డినేటర్‌ నంద కిషోర్‌, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, బద్వేల్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి తుడుమెల్ల మురళి, శ్రీనివాసులు, నాయకులు కార్యకర్తలు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ, ప్రాజెక్టు కార్యదర్శి మేరీ పోరుమామిళ్ల అంగన్వాడీ అధ్యక్షులు దస్తగిరిమ్మ ,సెక్టార్‌ లీడర్లు రేణుక, జ్యోతి ,లక్ష్మీదేవి, శ్రీదేవి ,రమాదేవి ,అంజనాదేవి, అంగన్వాడీి వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు . ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 18 రోజులుగా సిఐటియు, ఎఐటియుసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చలించడంలేదని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్య నారాయణ, సిఐటియు కార్యదర్శి విజ యకుమార్‌, ఎఐటియుసి నాయకులు మంజుల పేర్కొన్నారు. 18వ రోజు సమ్మెకు టిడిపి నాయకులు సి.ఎం. సురేష్‌ నాయుడు, ముక్తియర్‌, ఇ.వి. సుధాకర్‌రెడ్డి అంగ న్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ఎన్ని రోజులు అయితే సమ్మెలో కూర్చున్నారో అన్ని రోజులకు జీతాలు ఇస్తామని చెప్పారు. రోజూ 500 మందికి సమ్మెలో ఉన్న వారికి భోజనాలు పంపిస్తామన్నారు. కార్యక్ర మంలో అంగ న్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బ లక్ష్మి, సెక్టార్‌ లీడర్లు రాజీ, నాగలక్ష్మి, రాణి, నిర్మల, కష్ణవేణి, లక్ష్మీదేవి ఎఐటియుసి విజయమ్మ, అర్బన్‌ సెంటర్ల అంగన్వాడీలు పాల్గొన్నారు. బద్వేలు :అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె 18వ రోజులో భాగంగా శుక్రవారం స్థానిక సమగ్ర శిశు అభివద్ధి అధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (సిఐటియు) బద్వేల్‌ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు కోడూరు సుభాషిని, ప్రధాన కార్యదర్శి ఆర్‌.హుస్సేనమ్మ పూలమాలలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం పట్టణ నాయకురాళ్లు మోక్షమ్మ, బాలమ్మ, సిఐటియు పట్టణ కో-కన్వీనర్‌ పి.సి.కొండయ్య, నాయకులు రాజగోపాల్‌, డివైఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు షేక్‌ ఆదిల్‌, జీవి రమణారెడ్డి, పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️