ఘనంగా టిడిపి ఆవిర్భావ వేడుకలు

Mar 29,2024 23:09
tdp

తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సీట్లు పంపిణీ చేశారు. సామర్లకోట టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌, కంటే జగదీష్‌ మోహన్‌, బలుసు వాసు, యార్లగడ్డ చిన్ని, గొల్తి సత్తిరాజు, గోల్తి సత్యనారాయణ, సోమేశ్వరరావు, అందుగుల జార్జ్‌ చక్రవర్తి, తాతపూడి కృష్ణబాబు, కాపవరపు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్‌ టిడిపి కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌ పిల్లి సత్యనారాయణ వలసపాకలులోని స్వగహంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి, జనసేన పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, బుంగా సింహాద్రి, పాలిక ఉషా రాణి, పలివెల త్రిమూర్తులు, లోవ బాబు, నరసింగరావు, యాళ్ల రాజా, బొజ్జా భవాని సాంబశివరావు, ప్రకాష్‌, లోవరాజు, మేడిశెట్టి యేసు, పంపన బుజ్జి, తాతపూడి రామకృష్ణ, అచ్యుత్‌, వెంకటేశ్వరరావు, దొరబాబు పాల్గొన్నారు. కటకంశెట్టి వెంకట ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిపిటి ఎదురుగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవు వెంకన్న, మట్ట ప్రకాష్‌ గౌడ్‌, కొల్లాబత్తుల అప్పారావు, కొండ వినరు, బచ్చల కామేష్‌ పాల్గొన్నారు. జగ్గంపేట టిడిపి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌, ఎస్‌విఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, సత్తి సదాశివరెడ్డి, అడబాల భాస్కరరావు, పిలా మహేష్‌, నండ్ల చిరంజీవి, నేదూరి గణేష్‌, అరటా పోలీస్‌, కొండ్రోతు శ్రీను, పాల్గొన్నారు. తాళ్లరేవు టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల సుబ్బరాజు స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టా త్రిమూర్తులు, నడింపల్లి వినోద్‌, పిల్లి సత్తిబాబు, ఎం.గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, ఉంగరాల వెంకటేశ్వరరావు, ముత్యాల జయలక్ష్మి పాల్గొన్నారు.

➡️