జగనన్న ఆరోగ్య సురక్షతోనే సంపూర్ణ ఆరోగ్యం

Jan 9,2024 19:58 #Kurnool

ప్రజాశక్తి – చాగలమర్రి : మండలలోని మద్దూరు గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి డాక్టర్‌ ఇమ్రాన్‌ ప్రత్యేక వైద్యులను జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దూరు సచివా లయ పరిధిలోని బ్రాహ్మణ పల్లె, మద్దూరు గ్రామాల ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో అనేక రకాల వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్‌ దినేష్‌, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ షేక్‌ ఇమ్రాన్లు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమంది రోగులను మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఆళ్లగడ్డ నంద్యాల ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. ప్రభుత్వం సరఫరా చేసే కంటి అద్దాలను ఉచితంగా రోగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షులు దస్తగిరి, వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు రామలింగారెడ్డి వెంకటమ్మ, వెంకటలక్ష్మి ఫార్మాసిస్ట్‌ రాజేష్‌,ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీనివాసులు నాయక్‌, తేజస్విని, భాగ్యలక్ష్మి బారు, కార్యదర్శి మనోజ్‌ కుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచు ఎంపీటీసీలను పిలవకపోవడం కొసమెరుపు. పాములపాడు : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుందని ఎంపీడీవో గోపికృష్ణ, ఎంపీపీ సరోజినీ వర్జినయ తెలిపారు. మద్దూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ గులాబీష, హెల్త్‌ ఎడిటర్‌ మల్లికార్జున, డాక్టర్స్‌ హాజరై వచ్చిన పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ సోమల సుధాకర్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోకవరం పీహెచ్సీ పరిధిలోని ఎదురుపాడు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠ శాలలో రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును డాక్టర్‌ విజయేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ద్వారా 970 మంది ఆయా వ్యాధులకు వైద్యం అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జూబేద, జబీర్‌, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డిలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.మిడుతూరు: మండలంలోని చెరుకుచర్ల గ్రామంలో ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించారు. తలముడిపి పిహెచ్‌సి డాక్టర్‌ మద్దిలేటి, డాక్టర్స్‌, సూపర్వైజర్స్‌, సిహెచ్‌ఓస్‌, వైద్య సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సోగరాజు మరియమ్మ, ఉప సర్పంచ్‌ నారాయణ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

➡️