పశుబీమా పథకాన్ని పునరుద్ధరించాలి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్లు పశు నష్టపరిహారం నిధులను పెంపకందార్లు, రైతుల ఖాతాల్లో జమ చేసి వారి ఆదుకోవాలని ఎపి గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో సంఘం జిల్లా కమిటీ సమావేశం కండే బాలకష్ణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా శ్రీరామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల జబ్బులు, ప్రమాదాలు, ప్రకతి వైపరీత్యాలతో వందలాది జీవాలు చనిపోయి పెంపకం దారులు ఆర్థికంగా నష్ట పోతున్నారన్నారు. రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన జీవాలకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఆ పథకాన్ని మధ్యలోనే రద్దు చేయడం దుర్మార్గమన్నారు. పశు బీమా పేరుతో మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చి కేవలం 10 శాతం మాత్రమే గొర్రెలకు బీమా చేసి మధ్యలోనే ఆ పథకాన్ని ఆపేసినట్లు తెలిపారు.గొర్రె ఖరీదును ఆరు వేలుగా నిర్ణయించడం సరైంది కాదదన్నారు. రూ.10 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్న పెంపకందారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఎంతో కొంత ఉపయోగ పడుతున్న పథకాలను ఎత్తివేయడం, కొత్త పథకాల పేరుతో పెంపకం దారులపై భారాలు వేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంపకం దారుల పట్ల నిర్లక్ష్యం వీడి వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించి వత్తిని అభివద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బొడ్డు రామరాజు, రావెళ్ల వెంకట్రావు, గుమ్మా బాలనాగయ్య , నక్క గంగరాజు, బొమ్మన పోయిన శివయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, కోనంకి ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️