ప్రధానికి ఘనస్వాగతంతిరుమలకు చేరుకున్న మోదీఅడుగడుగునా నిఘా..

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరోతిరుపతి- తిరుమల

ప్రధానికి ఘనస్వాగతంతిరుమలకు చేరుకున్న మోదీఅడుగడుగునా నిఘా..ఎస్‌పిజి కంట్రోల్‌లో తిరుమల, తిరుపతినేడు శ్రీవారి దర్శనంఘనస్వాగతం పలికి గవర్నర్‌, సిఎంప్రజాశక్తి- తిరుపతి బ్యూరోతిరుపతి- తిరుమల రెండురోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 7.35గంటలకు తిరుపతి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ప్రధానికి ఎపి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అహ్మద్‌, సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రధాని రోడ్డుమార్గం గుండా తిరుమలలోని రచన అతిథి గృహానికి 8.25గంటలకు చేరుకున్నారు. టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిని రెండురోజుల పాటు ఎస్‌పిజి కంట్రోల్‌కి తీసుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా మూడువేల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు, అడుగడునా భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10.20గంటలకి ప్రధాని శ్రీవారిని దర్శించుకుంటారు. దాదాపు అరగంటపాటు శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆయన వెంట ఎపి గవర్నర్‌ ఉన్నారు. శ్రీవారి దర్శన అనంతరం ప్రధాని 12గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక నావికాదళ విమానంలో బయలుదేరి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తిరుమల రచన గెస్ట్‌ హౌస్‌ వద్ద స్వాగతం పలికిన వారిలో టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఉన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు ఘనస్వాగతంభారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కి ఘనస్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, డాక్టర్‌ గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డి, తిరుపతి నగర మేయర్‌ డాక్టర్‌శిరీష, శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, వరప్రసాద్‌ రావు, ఆదిమూలం, వెంకటే గౌడ, జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణారెడ్డి, జెసి డికె బాలాజీ, డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి, తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బు రాజన్‌, నగరపాలక కమిషనర్‌ హరిత, నగర డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, ఆర్డీవోలు నిశాంత్‌ రెడ్డి, చంద్రముని, రవి శంకర్‌రెడ్డి, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. సిపిఎం, సిపిఐ నాయకులు అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుమలకు విచ్చేస్తున్న సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే సిపిఎం నాయకులను పోలీసుల అక్రమంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఖండించారు. ఆదివారం ఉదయం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజును హౌస్‌ అరెస్ట్‌ చేసి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళికి షాడో పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.జయచంద్ర, జిల్లా అధ్యక్షులు ఎం.నరేంద్ర, నాయకులు టి.సుబ్రమణ్యం, ఎం.మాధవ్‌లను సిపిఎం జిల్లా కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుమన్‌ను తిరుచానూరులో, అలిపిరి వద్ద ఉంటున్న ఆర్‌.లక్ష్మిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వెంకటగిరిలో చెంగయ్యను, పుత్తూరులో వెంకటేశులను అరెస్ట్‌ చేశారు. విభజన హామీలను, ప్రత్యేకహోదాను ఇవ్వని నరేంద్ర మోదీ అక్రమ అరెస్టులతో పర్యటన చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏడు కొండలవాడ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటన చేసిన నరేంద్ర మోదీ, రాష్ట్రానికి ద్రోహం చేసి ఏముఖం పెట్టుకొని తిరుమలకు విచ్చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అభివద్ధిని అడుగడుగునా బిజెపి అడ్డుకుంటుందని విమర్శించారు. బిజెపి తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రేణిగుంటలో ‘మోదీ గో బ్యాక్‌’ సిపిఎం నాయకుల నిరసనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం తిరుపతి రానున్న సందర్భంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, కష్ణా జలాల విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహానికి నిరసనగా మోదీ గో బ్యాక్‌ అంటూ నల్ల చొక్కాలు- బ్యానర్లతో సిపిఎం, సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. దీంతో సిపిఎం మండల కార్యదర్శి కె.హరినాథ్‌, నాయకులు వెంకట రమణ, సెల్వరాజ్‌, శివానందం, నరసింహారెడ్డి, సిపిఐ నాయకులు తులసీ రాజన్‌లకు అరెస్టు చేసి రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు.బుచ్చినాయుడు కండ్రిగలో సిపిఐ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్యను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన మోదీ గో బ్యాక్‌సిపిఎం జిల్లా నేత కందారపు మురళి పుత్తూరు టౌన్‌: సీమాంధ్రకు ద్రోహం చేసిన మోదీ గో బ్యాక్‌ అని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి నిరసన తెలిపారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కందారపు మురళి, పట్టణ కార్యదర్శి వెంకటేష్‌, పెరుమాళ్‌ మాట్లాడుతూ 2014 తిరుపతి తారకరామా స్టేడియంలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, అమరావతి రాజదానికి నిధులు ఇస్తానన్న నరేంద్ర మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని వాపోయారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కష్ణా జలాల పునఃపంపిణీపై నోటిఫికేషన్‌ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అందులో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. 9 సంవత్సరాల తరువాత తిరుపతికి రావడానికి మోదీకీ సిగ్గుండాలని అన్నారు. కమ్యూనిస్టులు మోదీనీ అడ్డుకుంటామని జగన్‌రెడ్డికీ భయం పుట్టి తెల్లవారు జామున కమ్యూనిస్టులను హౌస్‌ అరెస్టులు చేయించారని అన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజాఉద్యమాలను ఆపలేరని, కచ్చితంగా వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఆంధ్ర ద్రోహి మోదీ తిరుపతికి వచ్చే అర్హత లేదు..సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళిఆంధ్ర ద్రోహి నరేంద్ర మోదీ తిరుపతికి వచ్చే అర్హత లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి హెచ్చరించారు. నరేంద్ర మోదీ 26, 27 తేదీలలో తిరుపతికి వస్తున్న సందర్భంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నరేంద్ర మోదీని ఎక్కడ అడ్డుకుంటామని వామపక్ష పార్టీ నాయకులను ఆదివారం ఉదయం నుంచే హౌస్‌ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. హౌస్‌ అరెస్టుల్లో అయిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య, రాధాకష్ణ, కుమార్‌ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్‌డి.రవి, రామకష్ణ ఉన్నారు.

➡️