మలయాళ సినిమాలో అనుష్కశెట్టి

Mar 12,2024 19:06 #anushka, #movie

అనుష్కశెట్టి గత ఏడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. చిత్రంలో కనిపించారు. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో ‘కథనార్‌ :ది వైల్డ్‌ సోర్సెరర్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రానుంది. అనుష్క చేస్తున్న తొలి మలయాళ చిత్రమిది. సోమవారం సెట్స్‌ మీదకెళ్లింది. ఈ చిత్రం షూటింగ్‌ మొదలై చాలా కాలం అయినా అనుష్క సోమవారం సెట్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రోజిన్‌ థామస్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు షేర్‌ చేసి చెప్పారు.

➡️