లోక్‌అదాలత్‌లో కేసులకు శాశ్వత పరిష్కారం : జడ్జి

ప్రజాశక్తి-రైల్వేకోడూరు స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలతో మొత్తం 75 కేసులు పరిష్కారం అయ్యాయని జూని యర్‌ సివిల్‌ జడ్జి అంజని ప్రియదర్శిని తెలిపారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ నందు రాజీ కాదగినటువంటి క్రిమినల్‌, సివిల్‌, బ్యాంకు కేసులను దాదాపు 75 కేసులు పరిష్కరించి రూ.18,30,614లు నగదు అర్జీదారులకు ఇప్పించడం జరిగిందన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కార్యక్రమంలో అర్బన్‌ సిఐ బాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.వెంకట రామరాజు, సీనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. నందలూరు: జాతీయ లోక్‌ అదాలత్‌ నందు 73 కేసులకు శాశ్వత పరిష్కారం లభించినట్లు నందలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ కె.లత పేర్కొన్నారు. జూని యర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టు లో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సివిల్‌ కేసుల్లో రూ.6లక్షలు, క్రిమినల్‌ కేసుల్లో రూ.35,69,600లు ఫిర్యా దారులకు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంల నందలూరు,రాజంపేట ఎపిపిలు ఉమారాణి, రెహనా రసూల్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దాసరి నరసింహులు, న్యాయ వాదులు మహ మ్మద్‌ అలీ, ఆనంద్‌ కుమార్‌, ఎజిపి షమీ ఉల్లా ఖాన్‌, కోర్టు కానిస్టేబుల్‌, కోర్టు సిబ్బంది, పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టులో శనివారం మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు స్థానిక ఇన్‌ఛార్జి జడ్జి అధ్యక్షతన లోకదాలత్‌ నిర్వహించారు. ఒక ఒఎస్‌ సంబంధించిన కేసు మరో మూడు క్రిమినల్‌కు సంబంధించిన కేసులను ఇరు వర్గాల కక్షీదారుల సమ్మతి మేరకు పరిష్కరించారు. కేసులకు సంబంధించి రూ.1,70లక్షలు రికవరీ చేశారు. లోక్‌ అదాలత్‌లో కేసులకు శాశ్వత పరిష్కారం వస్తుందన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసి యేషన్‌ అధ్య క్షులు నాగమల్‌రెడ్డి, న్యాయ వాదులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.

➡️