లాంఛనంగా ప్రారంభమైన అమర్‌ దీప్‌, సుప్రిత కొత్త సినిమా

Feb 1,2024 17:33 #movies

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అమరదీప్‌ హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నూతన చిత్రం ప్రారంభం అయింది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.2గా మహేంద్ర నాథ్‌ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్‌ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా.. వీర శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో చిత్ర యూనిట్‌ మాట్లాడింది. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాథ్‌ కూండ్ల , దర్శకుడు మాల్యాద్రి రెడ్డి, తేజస్వీ, గౌతమ్‌ కృష్ణ, సురేఖా వాణి, కమెడియన్‌ రఘు, నటుడు, దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️