ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

ఘనంగా అచ్చెన్నాయుడు నామినేషన్‌

జనసంద్రంగా మారిన టెక్కలి

ప్రజాశక్తి- టెక్కలిరాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఆయిందని, ప్రజాసంక్షేమం కనుమరు గయిందని, విలువలు లేని వ్యక్తులు రాజకీయాల్లోకి రాష్ట్రం నాశనమైందని టెక్కలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నామినేషన్‌ వేసిన అనంతరం అంబేద్కర్‌ కూడలి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వంటి మహోన్నత వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం గర్వ కారణమన్నారు. ఎన్‌టిఆర్‌ను ఆశీర్వది ంచిన టెక్కలి ప్రజలు తనని రెండు సార్లు ఆశీర్వదించారని, ముచ్చటగా మూడోసారి ఆదరించాలని ఓటర్లను కోరారు. టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. పార్లమెంట్‌కి రెండుసార్లు ఎంపీగా పంపిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడుని మరలా మూడోసారీ పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్ది కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ వైసిపి పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని కాపాడలంటే ఒక్క టిడిపి మిత్రపక్షమైన పార్టీల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. నామినేషన్‌ సందర్భంగా మండలంలోని అక్కవరం వరకు చైతన్యరథంపై వచ్చారు. అనంతరం టెక్కలి సబ్‌కలెక్టర్‌ కార్యాల యానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌కు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా తరలివచ్చిన వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఎండల ధాటికి డీలా పడ్డారు. ఒకానొక దశలో ఎండల తీవ్రత వల్ల చెల్లాచెదురయ్యారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌, బగాది శేషగిరి, పినకాన అజరుకుమార్‌, జీరు భీమారావు, బోయిన గోవిందరాజు, రమేష్‌ పాల్గొన్నారు.

 

➡️