అమానుగుడిపాడులో ఎరిక్షన్‌బాబు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలం అమానుగుడిపాడు గ్రామంలో మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర కుమారుడు మన్నె రవిచంద్ర, టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, టిడిపి నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, వడ్లమూడి లింగయ్య, జాగర్లమూడి వెంకటేశ్వర్లు, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, ఒంగోలు ఆదిరెడ్డి, కె భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️