హృతిక్‌.. ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్‌’

Dec 4,2023 20:11 #New Movies Updates

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్‌’. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి హృతిక్‌ రోషన్‌ రోల్‌కు సంబంధిం చిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేశారు. ఎయిర్‌ డ్రాగన్స్‌ విభాగంలో స్క్వాడ్రన్‌ పైలట్‌గా పనిచేసే స్క్వాడ్రన్‌ లీడర్‌ షంషేర్‌ పఠానియా (పాటీ)గా హృతిక్‌ కనిపించబోతున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా టీజర్‌ను డిసెంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

➡️