వెలగవాడ చెక్‌ పోస్టు తనిఖీ చేసిన కలెక్టర్‌

Apr 12,2024 21:30

పాలకొండ : మండలంలోని వెలగవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌ జిల్లా సరిహద్దు చెక్‌ పోస్టును జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమతో పాటు తీసుకువెళ్ళే నగదు, బంగారం, ఆభరణాలు వంటి వాటికి విధిగా ఆధారాలు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలు రవాణాపై గట్టి నిఘా ఉండాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డిఎస్పీహొ కష్ణారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇవిఎంలో మొదటి దఫా రేండమైజేషన్‌ పూర్తి

జిల్లాలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం)ల మొదటి రేండమైజేశన్‌ శుక్రవారం పూర్తయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ నేతృత్వంలో స్థానిక కలెక్టరేట్‌లో రేండమైజేషన్‌ చేపట్టారు. రేండమైజేశన్‌ ద్వారా ఏ ఇవిఎం ఏ నియోజకవర్గానికి వెళ్తుందో వివరించారు. వాటి వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ శోబిక, ఇన్‌ ఛార్జ్‌ జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు, ఇవిఎంల నోడల్‌ అధికారి ఎన్‌ రమేష్‌ రామన్‌, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️