పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్థంతి ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను ఎగురవేసి సుందరయ్యకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డీకేఎం రఫీ మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తికై కడవరకు పోరాడిన కమ్యూనిస్టు గాంధీ సుందరయ్య అని అన్నారు. సుందరయ్య ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు, ఆర్భాటల కు దూరంగా ఉంటూ 6 దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహౌన్నత వ్యక్తి అని అన్నారు. 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ పిలుపునం దుకొని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకు వెళ్లాడన్నా రు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన కడవరకు కార్మిక వర్గ దృక్పథంతో వారి ప్రయోజనం కోసం, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తూ నమ్మిన సిద్ధాంతా నికి కడవరకు కట్టుబడిన మహానేత సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు పి రూబెన్‌, కాశయ్య, విక్టర్‌, కిరణ్‌, శారా పాల్గొన్నారు. సంతనూతలపాడు: దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, త్యాగజీవి పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా సంతనూతలపాడులోని సుందరయ్య భవన్లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్‌ సెంటర్లో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్‌ మాబు, మండల కార్యదర్శి బంకా సుబ్బారావు, నాయకులు నెరుసుల వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్‌ నాయకులు కోదాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా మండలం లోని పేర్నమిట్ట, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో సిపిఎం జెండాలను ఆవిష్కరించారు. పేర్నమిట్టలో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు బీవీ రమణ, అన్ను వెంకట సుబ్బారావు, మైనంపాడులో కిలారి పెద్దబ్బాయి, అద్దంకి భగత్‌సింగ్‌, కరిచేటి హనుమంతరావు పాల్గొన్నారు. మంగమూరులో జరిగిన కార్యక్రమంలో షేక్‌ మస్తాన్‌, అబ్బూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా ఆదివారం పెద్దదోర్నాలలోని పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పేదల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మండలంలోని చిన్నగుడిపాడు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, దావీదు, పిచ్చయ్య, రాజాకృష్ణ, వెంకటేశ్వర్లు, మిరియాల వెంకటేశ్వర్లు, శివాచారి తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌: దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత, పేద ప్రజల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా గిద్దలూరు సిపిఎం కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం గిద్దలూరు డివిజన్‌ నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య.. రెడ్డి సామాజికవర్గంలో పుట్టినా అణగారిన వర్గాల, పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. పేద ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకుడని, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి థామస్‌, రాజశేఖర్‌, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️