వరికూటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

Apr 2,2024 01:05 ##YSRCP #Ve, #uru #Ashokbabu

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల కోసం వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో ఉన్నారు. వైసిపి అభ్యర్ధి వరికూటి అశోక్‌బాబు కోసం ఆయన భార్య లక్ష్మి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో కనిపించని టిడిపి అభ్యర్థి నక్క ఆనందబాబు కుమారుడు నక్క అఖిలేష్ గత పది రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. టిడిపి మేనిఫెస్టో పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి వివరిస్తున్నారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి వరికూట అశోక్ బాబు గత మూడు నెలలుగా విస్తృతంగా పర్యటన చేస్తుండగా ఆయనకు అండగా భార్య లక్ష్మి, ఇరువురు కుమారులు కూడా తమ వంతు ప్రచారం చేపట్టారు. వరికూటి లక్ష్మి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులను కలుపుకొని గ్రామాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
మంత్రి నాగార్జున మార్పుతో గట్టి పోటాపోటీ
వేమూరు ఎంఎల్‌ఎ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకు మార్పు చేయడంతో వేమూరు నియోజకవర్గంలో టిడిపి, వైసిపి మధ్య గట్టి పోటీ నెలకొంది. మంత్రి నాగార్జున పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతతో ఆనందబాబు గెలుపు తనదేననే ధీమాతో ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. వైసీపీ ఇన్చార్జిగా వరికుట అశోక్ బాబును వేమూరు అభ్యర్ధిగా సిఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుండి అశోక్‌బాబు నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రచారం చేపట్టడంతో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

➡️