వైసిపి ఆధ్వర్యంలో సంక్షేమ పాలన : వలపర్ల నుండి యడం బాలాజీ ప్రచారం ప్రారంభం

Apr 2,2024 01:07 ##YCP #Balaji

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి యడం బాలాజీ కోరారు. వైసిపి శ్రేణులతో కలిసి మండలంలోని వలపర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. స్థానిక అభయ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆర్యవైశ్య కాలనీలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించిన సంక్షేమ పధకాల లబ్దిని ప్రజలకు వివరించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసినట్లు తెలిపారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా రాష్టాభివృద్దికి బాటలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి భూక్యా శాంతి భాయి, బాబు నాయక్, వైసిపి మండల అధ్యక్షులు పఠాన్ కాలేషా వలి, వక్ఫ్ బోర్డు జిల్లా కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి, స్థానిక నాయకులు కోటినాగులు, ప్రగడ రామారావు, అజీమ్, మైలా చిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️