చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం..

Jan 23,2024 12:05 #China, #Earthquake

చైనా : భారీ భూకంపంతో చైనా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్థాన్‌- జిన్జియాంగ్‌ సరిహద్దు ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. చైనాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు.. భూకంపం సంభవించింది. 4 గంటల నాటికి.. అంటే కేవలం 2 గంటల్లో 14సార్లు భూమి కంపించింది. వీటిల్లో అత్యధిక తీవ్రత 3.0గా ఉంది. జిన్హావ్‌లో మాత్రం.. 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడినట్టు తెలుస్తోంది. అనేక భవనాలు నేలమట్టమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంపం ప్రభావిత ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చైనాలో గడిచిన 24 గంటల్లో అనేకమార్లు భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భూకంపం అక్కడి రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపించింది. మొత్తం 27 రైళ్లు రద్దు అవ్వడం లేదా ఆలస్యంగా నడుస్తుండటం జరిగిందని జిన్జియాంగ్‌ రైల్వే విభాగం వెల్లడించింది.

➡️