నేటి నుండి రెండు రోజులపాటు సియోల్‌లో త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సు

  • చైనా, ద.కొరియా, జపాన్‌ నేతల హాజరు

సియోల్‌: నాలుగేళ్ల విరామం తరువాత చైనా, జపాన్‌, ద. కొరియా దేశాలతో కూడిన తొమ్మిదో త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సు ఆది, సోమ వారాల్లో ఇక్కడ జరగనుంది. ఈ సదస్సుకు జపాన్‌ ప్రధాని కిషిదా, ద.కొరియా అధ్యక్షులు యూన్‌ సుక్‌ యోల్‌, చైనా ప్రధానికి లీ ఖియాంగ్‌ హాజరవుతున్నారు. ఆగేయాసియా దేశాల సుస్థిరత ప్రోత్సహించడం, ఆర్థిక, వాణిజ్య, భద్రత , ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి ఆరు రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ సదస్సు దృష్టి సారించనుంది. అలాగే వీటి మధ్య సాధారణ సంబంధాల పునరుద్ధరణపై ప్రత్యేకంగా కేంద్రీకరించనుంది. వీటితోబాటు అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులపై మూడు దేశాల నేతలు చర్చించనున్నట్లు ద.కొరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు 2019లో జరిగింది.

➡️