యుద్ధ విమానానికి పైలట్‌గా ‘ఎఐ’

May 4,2024 08:42 #'AI' effect, #fighter pilot

వాషింగ్టన్‌ : కృత్రిమ మేధ (ఎఐ) క్రమక్రమంగా అన్ని రంగాల్లో ప్రవేశిస్తుంది. ఇప్పుడు యుద్ధవిమాన పైలట్‌గా కూడా ఎఐ ఎదిగింది. తాజాగా ఎఐ నియంత్రిత ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ అమెరికాలో గగనవిహారం చేసింది. అందులో వైమానిక దళ సెక్రటరీ ఫ్రాంక్‌ కెండాల్‌ పయనించడం విశేషం. 1990లలో స్టెల్త్‌ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాక సైనిక విమానయాన రంగంలో చోటుచేసుకున్న అతిపెద్ద పురోగతి ఎఐ సాంకేతికత. ఈ టెక్నాలజీ ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోనప్పటికీ వెయ్యి ఎఐ ఆధారిత జెట్‌లను 2028 నాటికి ప్రవేశపెట్టాలని అమెరికా వాయుసేన భావిస్తోంది. తాజాగా గగనవిహారం చేసిన ఏఐ నియంత్రిత ఎఫ్‌-16కు విస్తా అని పేరుపెట్టారు.

➡️