కెనడాలో ఘోర రోడ్డుప్రమాదం – భారతీయ వృద్ధ జంట.. మనవడు మృతి

కెనడా : కెనడాలోని ఓంటారియోలో గత సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ జంట, వారి మూడు నెలల మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర గాయాలపాలయ్యారు. మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులు పోలీసులను నుంచి తప్పించుకునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతూ పలు కార్లను ఢకొీట్టారు. ఈ ఘటనలో ఓ కారులోని వృద్ధ దంపతులు మణివణ్ణన్‌, మహాలక్ష్మి, వారి 3 నెలల మనవడు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. మనవడిని చూసేందుకు వారు కెనడా వెళ్లినట్టు తెలిసింది. చిన్నారి తల్లిదండ్రులు ఎజాక్స్‌లో నివసిస్తుంటారు. ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్‌ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి తఅటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి తాను చూసింది మీడియాతో పంచుకున్నారు. ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్న తనకు నిందితులు రాంగ్‌రూట్లో ఎదురుగా వచ్చారని చెప్పారు. ఆ క్షణం తన కళ్లను తానే నమ్మలేకపోయానని ఆమె చెప్పారు. అది చాలా భయానక అనుభవమని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్‌ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బఅందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️