ఇజ్రాయిల్‌ దాడి హమాస్‌ను నిర్మూలించే అవకాశం లేదు : బ్లింకెన్‌

May 15,2024 09:48 #attack, #eliminate, #Hamas, #Israel, #unlikely

రఫా : దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయిల్‌ పూర్తి స్థాయి దాడి అరాచకత్వాన్ని పెంచుతుందే తప్ప హమాస్‌ను నిర్మూలించే అవకాశమే లేదని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ అన్నారు. హమాస్‌ను అంతమొందించడంలో ఇజ్రాయిల్‌ వ్యూహాలు విఫలమయ్యాయని, ఈ స్థితిలో గాజా నుండి ఇజ్రాయిలీ దళాలు బయటకొస్తాయనే తాము ఆశిస్తున్నామని అన్నారు. గాజా ఉత్తర ప్రాంతంలో కొన్ని భాగాలను హమాస్‌ గ్రూపు తిరిగి తన అధీనంలోకి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

➡️