పాకిస్తాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

Feb 17,2024 12:28 #Earthquake, #Myanmar, #Pakistan

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రతగా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎస్‌సిఎస్‌) తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అర్థరాత్రి 12.57 గంటల సమయంలో పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. వెడల్పు : 35.67, పొడవు : 71.90, 190 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మయన్మార్‌లో కూడా శనివారం భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 9.25 గంటల సమయంలో మయన్మార్‌లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) ఎక్స్‌లో పోస్టు చేసింది. వెడల్పు 22.96, పొడవు : 93.77, 47 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️