చాద్‌ ఆయుధాగారంలో పేలుళ్లు.. 9 మంది మృతి

Jun 20,2024 00:08 #9 people died, #arsenal, #Explosions

ఎన్‌జమెనా : చాద్‌ రాజధాని ఎన్‌జమెనాలోని సైనిక ఆయుధాగారంలో జరిగిన వరుస పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 40మందికి పైగా గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుళ్ల శబ్దాలతో నిద్రలో వున్న ప్రజలు ఉలిక్కి పడ్డారని, ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారని ప్రభుత్వ ప్రతినిధి అబ్దర్‌మన్‌ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. పేలుళ్లతో రాత్రిపూట ఆకాశమంతా పట్టపగల్లా మారిందని, దట్టమైన పొగ కమ్ముకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ళకు కారణమేంటో తక్షణమే తెలియరాలేదు. దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు అధ్యక్షుడు మహమత్‌ దేబె తెలిపారు.

➡️