Iran అధీనంలో నౌక – ఐదుగురు భారతీయులు విడుదల

Seized ship – గత నెల రోజులుగా ఇరాన్‌ అధీనంలో ఉన్న వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది. పర్షియన్‌ గల్ఫ్‌లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో భారత నావికులు ఐదుగురిని ఇరాన్‌ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌లోని భారత ఎంబసి మీడియాకు వెల్లడించింది. 17 మంది భారతీయులు ఉన్న ఇజ్రాయెలీ సరుకు రవాణా నౌకను ఇరాన్‌ అధికారులు గత ఏప్రిల్‌ 13వ తేదీన తమ అధీనంలోకి తీసుకున్న సంగతి విదితమే.

ఫిలిప్పీన్స్‌, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బంది విడుదల…
ఎంఎస్‌సి ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేసినట్లు భారత దౌత్య కార్యాలయం మీడియాకు తెలిపింది. విడుదలైన ఐదుగురు గురువారం సాయంత్రం వారి స్వదేశానికి బయలుదేరారని అధికారులు చెప్పారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసి, కాన్సులేట్‌ చేసే ప్రయత్నాలకు ఇరాన్‌ అధికారుల నుంచి సహకారం లభిస్తోందని దౌత్యకార్యాలయం తెలిపింది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్‌, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్‌ నిన్న విడుదల చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వివరాల కోసం …

ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

➡️