ఆఫ్ఘన్‌లో ఆకస్మిక వరదలు..  84 మంది మృతి

May 20,2024 08:25 #afgan, #floods

కాబూల్‌ : భారీ వర్షాల కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన తాజా ఆకస్మిక వరదల్లో 84 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని తాలిబాన్‌ ప్రతినిధి ఆదివారం వెల్లడించారు. ఫర్యాబ్‌ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాల్లో శనివారం రాత్రి ఆకస్మిక వరదలు సంభవించి 18 మంది వరకూ మరణించారని, అనేక ఇళ్లు, వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఇవి ప్రాథమిక గణాంకాలే అని అధికారులు చెప్పారు. అలాగే ఘోర్‌ ప్రావిన్స్‌లో 50 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో గతవారం భారీ వర్షాల కారణంగా 300 మందికి పైగా మరణించారు. ఏప్రిల్‌ నెలలో 70 మంది మరణించారు.

➡️