భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

Nov 25,2023 14:28 #Fire Accident

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఆర్‌జె షాపింగ్‌ మాల్‌లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కనీసం 11 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగగానే అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుని దాదాపు 50 మందిని రక్షించిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన 11 మంది మఅతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కరాచీ మేయర్‌ ముర్తజా వహాబ్‌ సిద్ధిఖీ ధఅవీకరించారు.

➡️