అమెరికాలో బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి

Nov 30,2023 10:29 #America

న్యూజెర్సీ : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి తన బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. న్యూజెర్సీలో ఉంటున్న ఓం బ్రహ్మ భట్‌(23) తన తాత, మామ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్‌ కుమార్‌ బ్రహ్మభట్‌ (72), బిందు బ్రహ్మభట్‌ (72), యశ్‌కుమార్‌ బ్రహ్మభట్‌లను(38) నిందితుడు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌ నుంచి వలస వచ్చిన ఓం బ్రహ్మ భట్‌.. బాధితులతో కలిసి నివసిస్తున్నాడు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపారన్నారు.

➡️