ఇజ్రాయిల్‌ మొసాద్‌ ఏజెంట్‌కు ఉరి 

Dec 17,2023 12:15 #Iran, #Israel
  •   రహస్య సమాచారం అందజేసినందుకే : ఇరాన్‌ 

టెహరాన్‌ :   ఇజ్రాయిల్‌ మొసాద్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌కి చెందిన ఏజెంట్‌ను ఆగేయ ఇరాన్‌లో సిస్తాన్‌-బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో శనివారం ఉరి తీసినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా తెలిపింది. ఆ వ్యక్తి విదేశీ సర్వీసులతో ముఖ్యంగా మొసాద్‌కు రహస్య సమాచారాన్ని అందజేస్తున్నాడని ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. నిందితుడు తన వద్ద గల రహస్య సమాచారాన్ని మొసాద్‌ ఆఫీసర్‌కు అందచేశాడని, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను వ్యతిరేకించే గ్రూపుల, సంస్థలకు ప్రచారం కోసం ఈ పని చేశాడని తెలిపింది. ఆ వ్యక్తి చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరించబడిందని ఇర్నా తెలిపింది. సిస్తాన్‌ – బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో జహెదాన్‌ జైల్లో ఈ ఉరిశిక్ష అమలైంది. ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌తో సరిహద్దులు కలిగిన సిస్తాన్‌ – బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో తరచూ భద్రతా బలగాలు, సున్నీ తీవ్రవాదులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ వుంటాయి. ఇరాన్‌ ప్రజల్లో ఎక్కువమంది షియా ముస్లింలు కాగా, ఈ ప్రావిన్స్‌లో వుండేవారు సున్నీ ముస్లింలు.

➡️