North Korea : బహుళ వార్‌హెడ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

ప్యోంగ్యాంగ్‌ :   ఉత్తర కొరియా బహుళ వార్‌హెడ్‌ క్షిపణి సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు స్థానియ మీడియా గురువారం తెలిపింది. వ్యక్తిగత మొబైల్‌ వార్‌హెడ్‌ల విభజన, మార్గదర్శక నియంత్రణ పరీక్షను నిర్వహించిందని, విభజించిన మొబైల్‌ వాటర్‌హెడ్‌లు మూడు సమన్వయ లక్ష్యాలను నిర్దేశం చేసినట్లు  పేర్కొంది. మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్స్‌ (ఎంఐఆర్‌విఎస్‌) సామర్థ్యానికి భద్రత కల్పించడం ఈ ప్రయోగం లక్ష్యమని పేర్కొంది. బహుళ వార్‌హెడ్‌లతో పాటు  బాలిస్టిక్‌ క్షిపణీని ధ్వంసం చేయగల సామర్థ్యం  ఉందని  తెలిపింది.

ఉత్తర కొరియా బుధవారం హైపర్‌సోనిక్‌ క్షిపణిని బుధవారం ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ ప్రకటించింది. క్షిపణి నుండి సాధారణం కంటే అధికంగా పొగలు వెలువడ్డాయని దక్షిణ కొరియా మిలటరీ  ఉన్నతాధికారి తెలిపారు.

➡️