పాకిస్తాన్‌లో రీపోలింగ్‌.. ఈసీ కీలక నిర్ణయం

Feb 11,2024 12:29 #Pakistan

పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ.. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొంది. దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్‌ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇప్పటికీ మరో ఏడు స్థానాలకు సంబంధించిన ఫలితాలు తేలాల్సి ఉంది. అయితే కౌంటింగ్‌ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 266 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇప్పటివరకు 259 సీట్లలో ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (ూు×) మద్దతుదారులు 102 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోవాలంటే మరో 31 చోట్ల గెలుపొందాల్సి ఉంది. కాగా, 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పీఎంఎల్‌ (ఎన్‌), 54 సీట్లొచ్చిన బిలావల్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

➡️