రియాన్ష్‌కు ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

May 4,2024 15:17 #riyansh

ప్రజాశక్తి కోటనందూరు
తుని శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌లో యుకెజి విద్యార్థి బి.రియాన్ష్‌ ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించాడు. ఐదు సంవత్సరాల రియాన్ష్‌ ఆన్లైన్‌ ద్వారా జరిగిన ఎంపిక ప్రక్రియలో కేవలం 9 సెకన్లులో దక్షిణ అమెరికా ఖండంలోని 13 దేశ జెండాలను గుర్తించి ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌ లో స్థానం సాధించాడు. అంతే కాకుండా ఈ విద్యార్థి ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడంతో పాటు ప్రపంచ దేశ రాజధానులు, భారత దేశ రాష్ట్రాల రాజధానులను గుర్తించడంలో కూడా ప్రతిభ కనబరుస్తున్నాడు. విద్యార్థి ఈ రకమైన ఘనత చిన్న వయస్సులోనే సాధించడం హర్షణీయమని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌. విజరు ప్రకాష్‌ తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సిహెచ్‌. వి. కె. నరసింహారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

➡️