అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Dec 30,2023 15:06 #death, #family, #usa

మసాచుసెట్స్‌ : అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్‌ కమల్‌ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్‌ కమల్‌ (57), ఆయన భార్య టీనా కమల్‌ (54), కుమార్తె ఆరియానా (18) అమెరికాలోని తమ విలాసవంతమైన భవనంలో విగతజీవులుగా కనిపించారు. రెండ్రోజులుగా వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రాకేష్‌ కమల్‌ మృతదేహం వద్ద తుపాకీని గుర్తించారు. ముగ్గురూ బుల్లెట్‌ గాయాలతోనే మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఇంట్లో ఘర్షణ జరగడంతో… భార్య, కుమార్తెను కాల్చివేసిన రాకేష్‌ కమల్‌… అనంతరం తనను కాల్చుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️