ఎన్నికల బాండ్లను స్వీకరించలేదు.. ఖాతా కూడా ప్రారంభించలేదు : సిపిఎం

Feb 16,2024 22:01 #cpm politburo, #prakatana

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలుగా కొంత మొత్తాలను సిపిఎం అందుకున్నట్లు ఒక సెక్షన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే ఆ వార్తలన్నీ నిరాధారమైనవని, తప్పుడు వార్తలని పార్టీ పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల బాండ్లను అంగీకరించరాదన్న సూత్రబద్ధవైఖరిని సిపిఎం మొదటినుంచి కలిగి ఉందని తెలిపింది. ఎన్నికల బాండ్లను స్వీకరించడానికి చట్టప్రకారం అవసరమైన ఎస్‌బిఐ ఖాతాను కూడా తెరవలేదని వివరించింది. మౌలికంగా వ్యతిరేకిస్తున్నందునే ఎన్నికల బాండ్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది.

➡️