జామియా మిలియా అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌ నియామకం

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్‌ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా నియామకం చేయాలని వర్సిటీని ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. చట్టానికి అనుగుణంగా నియామకాలు జరగలేదని పేర్కొంటూ జామియా మిలియా ఇస్లామియా ప్రో-వైస్ ఛాన్సలర్‌గా,  అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌గా హుస్సేన్‌ నినియమించడాన్ని హైకోర్టు రద్దు చేసింది. విశ్వవిద్యాలయంలోని అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ దెబ్బతినకుండా లేదా పూర్తిగా ఆగిపోకుండా చూసేందుకు అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్ పదవికి తాజాగా నియామకం చేయాలని ఆదేశించింది. ఈలోగా రెగ్యులర్ వీసీని నియమించే ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశించాలని భారత రాష్ట్రపతిని కోర్టు కోరింది.

మహ్మద్ షకీల్ జామియాలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్. యూనివర్శిటీ యొక్క రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన అఫిషియేటింగ్ విసీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. షకీల్ తన బిటెక్, ఎంటెక్  డిగ్రీలను అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) నుండి పొందారు. ఆ తర్వాత రూర్కీ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి  డిగ్రీని పొందారు. నవంబర్ 1986లో జామియా మిలియా ఇస్లామియాలో లెక్చరర్‌గా చేరిన ఆయన 1992, 2000 సంవత్సరాల్లో వరుసగా రీడర్ మరియు ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. షకీల్ డీన్, ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ ఫ్యాకల్టీ, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్, డైరెక్టర్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ వంటి వివిధ అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లో కూడా పనిచేశారు. విశ్వవిద్యాలయం యొక్క అనేక ముఖ్యమైన కమిటీలలో కూడా ఆయన భాగమయ్యారు. “అన్ని స్థాయిలలో విశ్వవిద్యాలయం యొక్క ప్రయోజనాలను కాపాడటానికి నేను నా వంతు కృషి చేస్తాను” అని అఫిషియేటింగ్ వీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షకీల్ అన్నారు.

➡️