ElectoralBonds: ‘అవి’ ముడుపులు కావా?

Mar 23,2024 13:11 #BJP, #Bonds Scam, #Electoral Bonds

ఇంటర్నెట్ : కేజ్రీవాల్ కి ఇస్తే ముడుపులు… బిజెపికి ఇస్తే ముడుపులు కావా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు ముడుపులిచ్చారని అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బిజెపికి కూడా ఎన్నికల బాండ్లు ద్వారా రూ.34.5 కోట్లు ఇచ్చారని వార్తపై ఈ విధంగా నెటిజన్లు స్పందిస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ పి శరత్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) 2022, నవంబర్ 10న అరెస్టు చేసింది. అరెస్టు చేసిన ఐదు రోజుల తరువాత ఆ కంపెనీ బిజెపికి రూ. 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చింది. ఆ కంపెనీ కొనుగోలు చేసిన మొత్తం రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లల్లో సగానికి పైగా అంటే రూ.34.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బిజెపికే అందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) ప్రత్యేక బాండ్ నంబర్ డేటాను గురువారం భారత ఎన్నికల కమిషన్ (ఈసిఐ)కి సమర్పించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిజెపికి ఇచ్చినవి కూడా ముడుపులే కదా అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు.

➡️