మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోద్దు

Mar 23,2024 17:16 #arrest, #Arvind Kejriwal, #Germany

జర్మనీ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్‌ ఫైర్‌

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుపై భారత్‌లోని జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రజాస్యామ్యమైన దేశమైనందున కేజ్రీవాల్‌కు న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరుగుతుందని తాము ఆశిస్తున్నామని జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ప్రకటించారు. దీంతో భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ‘భారతదేశం చట్టబద్దమైన బలమైన ప్రజాస్వామ్యం గల దేశం. దేశంలో, ప్రజాస్వామ్య ప్రపంచంలోని అన్ని చట్టపరమైన కేసుల్లో వలె.. తక్షణ కేసు విషయంలో కూడా చట్టం తనదైన విధానాన్ని తీసుకుంటుంది. పక్షపాత ధోరణి అవలంబిస్తుందనే అంచనాలు చాలా అసంబద్ధమైనవి.’ అని భారత విదేశాంగ ప్రకటించింది.

➡️