ఇద్దరు మాజీ సిఎంలను రంగంలోకి దించిన కాంగ్రెస్‌

May 6,2024 23:59 #2024 election, #CONGRES

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన అమేథీ, రారుబరేలీకి ఎట్టకేలకు ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. రారుబరేలీకి రాహుల్‌, అమేథీకి కిశోరీలాల్‌ శర్మలను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గాల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల పరిశీలకులుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను నియమించింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నియోజకవర్గాల ప్రచారానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఛత్తీసగఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌, రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్‌ను కూడా ప్రియాంక స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో 200 నుంచి 300 గ్రామాలను కవర్‌ చేస్తూ ప్రియాంక ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

➡️