ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Jan 4,2024 10:21 #Cyber Crimes
cyber crimes in india

ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది. ఈ మొతాన్ని 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31 కాలంలో కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ మొత్తంలో 1,127 కోట్ల రూపాయలను సక్సెస్ ఫుల్ గా నిలిపివేసినట్లు ఐ4సీ డైరెక్టర్‌ రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు. దీంతో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో 2021లో 4. 52 లక్షలు నమోదు కాగా, 2022లో 9. 66 లక్షల కేసులు, 2023లో ఏకంగా 15. 56 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

➡️