ఇడి, ఐటి గూండాగిరీ – సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌

తిరువనంతపురం : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), ఆదాయ పన్ను శాఖలు గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నాయని సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిపిఎం బ్యాంకు ఖాతాలన్నింటినీ చట్టబద్ధంగా నిర్వహిస్తోందని అన్నారు. సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి శనివారం రాత్రి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని చట్టపరంగా సవాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య పార్టీని భయభ్రాంతులకు గురిచేసే యత్నమని అన్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటంలో దాడిని ఎదుర్కోవలసిందేనని అన్నారు. చట్టబద్ధం కాని ప్రతీది చట్టబద్ధంగా వ్యవహరించాలని ఉద్దేశించింది. త్రిసూర్‌లో ఖాతాల గురించి పార్టీ నాయకత్వానికి తెలుసు. వాస్తవానికి అన్ని ఖాతాలు కేంద్రానికి ఇచ్చామని అన్నారు. వారికి తెలియని ఒప్పందం ఏమైనా ఉందా, అంతా పారదర్శకం కాదా అని ప్రశ్నించారు. 14 జిల్లాల, రాష్ట్ర కమిటీల ఖాతాలను కూడా ఇచ్చామని అన్నారు.

➡️