సీఎం సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు.. ఏ క్షణంలో అయినా అరెస్ట్..!

Jan 31,2024 14:40

జార్ఖండ్ : భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ నివాసానికి వెళ్లారు. ఈ కేసు విషయంలో ఆయనకు  పది సార్లు నోటీసులు జారీ చేసినా..  ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో ఇవాళ హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు సంబంధించి ఆయనను విచారిస్తున్నారు. ఏ క్షణంలో అయినా సొరెన్‌ను అరెస్ట్ చేసే పరిణామాలు కనిపిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

➡️