హర్యానా మాజీ ముఖ్యమంత్రిని విచారించిన ఈడి

 చండీగఢ్‌ :    హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భూపేంద్ర సింగ్‌ హుడాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించింది. 2004 -2007 మధ్య మానేసర్‌లో భూసేకరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడి బుధవారం ఆయనను విచారించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పిఎంఎల్‌ఎ నిబంధనల ప్ర కారం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు వెల్లడించాయి. ఈ భూసేకరణలో సుమారు రూ.1500 కోట్ల మేర మోసం చేశారని పలువురు రైతులు, భూయజమానులు ఆరోపించారు. 2016 సెప్టెంబర్‌లో హర్యానా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడి పిఎంఎల్‌ఎ కేసును దాఖలు చేసింది. ఈ కేసును సిబిఐ కూడా విచారిస్తోంది.

➡️