జార్ఖండ్‌ సిఎం మీడియా సలహాదారు సహా పలువురిపై ఈడి దాడులు

Jan 3,2024 13:41 #ED raids, #Jharkhand CM, #mining case

రాంచీ   :    జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మీడియా సలహాదారు సహా పలువురి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం దాడులు చేపడుతోంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మీడియా సలహాదారు అభిషేక్‌ ప్రసాద్‌ అలియాస్‌ పింటు, సాహిబ్‌గంజ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్‌, కొంతమంది జైలు విభాగం అధికారులతో పాటు పోలీస్‌ కానిస్టేబుల్‌ నివాసాలపై ఈడి అధికారులు సోదాలు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద రాష్ట్ర రాజధాని రాంచీ, రాజస్థాన్‌లోని ఓ ప్రాంగణం సహా రాష్ట్రంలోని డజనుకి పైగా ప్రాంతాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆయా ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలను మోహరించినట్లు వెల్లడించాయి. 2022 నుండి ఈ కేసులో ఈడి సోదాలు చేపడుతోంది. అక్రమమైనింగ్‌ ద్వారా రూ.100 కోట్ల ” నేర పూరిత ఆదాయం” ఆర్జించినట్లు ఆరోపించింది.

➡️