ఐదో ఏటా ఈద్‌ ప్రార్థనలకు అడ్డంకి

Apr 12,2024 06:54 #masid, #Srinagar
  •  కాశ్మీర్‌లో జామియా మసీదు మూసివేత

శ్రీనగర్‌ : శ్రీనగర్‌లోని చారిత్రక జామియా మసీదులో వరుసగా ఐదో ఏడాది కూడా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ప్రార్థనలకు అనుమతించలేదు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రార్థనలు నిర్వహించాల్సి ఉండగా, సాయుధ పోలీసులు జామియా మసీదు గేట్లు మూసివేశారు. ప్రార్థనలకు అనుమతి లేదని తెలియజేశారు. మత గురువు మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ను తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యను పలువురు మతపెద్దలు, సంఘాలు ఖండించాయి.

➡️