మాజీ ప్రధాని మనవడు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా

Feb 14,2024 15:54 #Congress, #Vibhakar Shastri

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవుడు విభాకర్‌ శాస్త్రి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ విషయాన్ని ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపిన లేఖలో తెలిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు దక్కకపోవడంతో విభాకర్‌ శాస్త్రి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈరోజే ఆయన ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సిఎం బ్రజేష్‌ పాఠక్‌ సమక్షంలో బిజెపిలో చేరారు.

కాగా, విభాకర్‌ శాస్త్రి 1998, 1999ల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. కానీ రెండుసార్లు ఓడిపోయారు.

➡️