ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Apr 2,2024 09:02 #dead, #Fatal accident, #Five

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : చిత్రకూట్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను డంపర్‌ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్‌ ప్రాంతం సమీపంలో వేగంగా వచ్చిన డంపర్‌ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదిమందిని జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా, అందులో ఐదుగురు మరణించారని జిల్లా ఆసుపత్రి సిఎంఎస్‌ డాక్టర్‌ ఆర్‌బి లాల్‌ తెలిపారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

➡️