అమిత్‌షాపై నకిలీ వీడియో కేసులో మరో నలుగురి అరెస్టు

May 1,2024 00:20 #Amit Shah, #arest

అహ్మదాబాద్‌ : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో గుజరాత్‌ పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఆప్‌, ఇద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు.. సోమవారం అస్సాం పోలీసులు గౌహతి హైకోర్టులో లాయర్‌ రీతమ్‌ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రీతం సింగ్‌ కాంగ్రెస్‌ అస్సాం వార్‌ రూమ్‌లో కోఆర్డినేటర్‌గానూ పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ 23న తెలంగాణలో అమిత్‌ షా చేసిన ప్రసంగాన్ని మార్చి వేశారనే ఆరోపణలతో ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్‌ పోలీసులు వేరువేరుగా నాలుగు కేసులు పెట్టారు.

➡️