ఆరు నెలల్లో 7.7 శాతం చేరుకోకున్న భారత్‌ జిడిపి : మోడీ

Dec 9,2023 15:42 #PM Modi

 

న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత్‌ జిడిపి వృద్ధి రేటు 7.7కి చేరువయ్యే అవకాశం ఉంది. నేడు ప్రపంచం మొత్తం భారత్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఆర్థిక వృద్ధి గత పది సంవత్సరాల్లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ప్రతిబింబం. భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ మార్కెట్‌లలో ఒకటి. జిఐఎఫ్‌టి ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సి) దాని కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.’ అని అన్నారు. ఇక ఈ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ (జిఐఎఫ్‌టి) సిటీని కొత్త యుగం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక సేవల ప్రపంచ నాడీ కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే గ్రీన్‌ క్రెడిట్స్‌ కోసం మార్కెట్‌ మెకానిజంను అభివృద్ధి చేయడంపై తమ ఆలోచనలను పంచుకోవాలని ఆయన నిపుణులను కోరారు.

 

 

➡️