ఎన్‌ఆర్‌ఐ ఓటర్స్‌లో ఫస్ట్‌ కేరళ

May 1,2024 03:55 #2024 election, #kerala, #voters
  • రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ : దేశంలో ఎన్‌ఐఆర్‌ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌) ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇసి డేటా ప్రకారం కేరళలో ఓటు వేయడానికి 74.9 శాతం మంది ఎన్‌ఐఆర్‌లు నమోదు చేసుకున్నారు. కేరళ తర్వాత ఎన్‌ఐఆర్‌ ఓటింగ్‌ కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ 6.4 శాతం ఎన్‌ఆర్‌ఐ ఓటర్స్‌ ఉన్నారు. తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర 4.7 శాతం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 2.9 శాతం ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎన్‌ఆర్‌ఐల సంఖ్య 1,18,000 దాటింది. 2019లో కంటే ఇప్పటికి 65 శాతం అధికం. ఇక 2014లో 12,000 మంది ఎన్‌ఆర్‌ఐలు తమ ఓటు నమోదు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటింగ్‌ ప్రాధాన్యత వారి ఓటింగ్‌ నమోదు చేసుకోవడం 2010 ముందు జరగలేదు. విదేశాల్లో నివశిస్తున్న భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వీలుగా వారి ఓటు హక్కును పొడిగించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని 2010లో సవరించారు. ఇది 2011లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎన్‌ఐఆర్‌లు ఓటు వేయాలి. 2024 ఎన్‌ఆర్‌ఐ ఓటర్లలో 11 శాతం మహిళలున్నారు. ఇది 2014లో కేవలం 6 శాతంగా ఉండేది. పది సంవత్సరాల్లో మహిళా ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల శాతం ఐదు శాతం పెరిగింది. మొత్తంగా వీరి పోలింగ్‌ శాతం 2019లో 67.4 శాతంగా ఉంది. కాగా రాష్ట్రాల వారీగా వీరి ఓటింగ్‌శాతంలో తేడా ఉంది. ఉదాహరణకు కేరళలో 2019లో 29 శాతం మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఓటు వేశారు. కర్ణాటకలో 4 శాతం, రాజస్థాన్‌ 3, ఉత్తరప్రదేశ్‌, చండీగఢ్‌ రాష్ట్రాల్లో ఒక శాతమే ఉంది.

➡️